🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
నా చిరునామా నీ హృదయాన
కొలువయ్యిందా అవునా ఏమో
నా చిరునవ్వే నీ పెదవుల్లో
వెలుగయ్యిందా అవునా ఏమో
నీ గుండెల్లో నిండాన
గోరింటల్లే పండాన
నిజమో కాదో నాకే తేలదుగా
నీ కళ్ళల్లో నేలేనా
నీ కళలల్లే రాలేనా
కలవో లేవో వెతికే చెపుతాగా
నా చిరునామా నీ హృదయాన
కొలువయ్యిందా అవునా ఏమో
మధువొలికే సిరిపెదవుల్లో
నువు దాచిన పేరు నాదేగా
ఉందనుకో అది నిజమైతే
మరి మాటగా మారదా
బుగ్గలో కుర్ర సిగ్గులే
ఎర్రబోతే నేను కాన
అవుననో ఇంక కాదనో
అర్ధమైతే చెప్పలేన
నీ మనసంటే నేనేగా
నీ మమతంతా నాదేగా
ఇంకా నాకే తెలియని సంగతిగా
నా చిరునామా మ్మ్ మ్మ్ నీ హృదయాన
మ్మ్ మ్మ్ కొలువయ్యిందా ఆఆ అవునా ఏమో
అడుగడుగు నీ ప్రతిపనిలో
ఊహించిన తోడు నేనేగా
నీ ఊహే నాకొచ్చిందా
గురుతెప్పుడు లేదుగా
చాటుగా పూట పూటగా
వెతికేదే నన్ను కాదా
కాదులే లేదు లేదులే
అపవాదా కన్నె వీణ
కాదంటుంటే అవుననిలే
లేదంటుంటే ఉందనిలే
ఏమో ఏమో ఏమో ఏమోలే
నా చిరునామా నీ హృదయాన
కొలువయ్యిందా నిజమేనేమో
నా చిరునావ్వే మ్మ్ నీ పెదవుల్లో ఆఆ
వెలుగయ్యిందా నిజమేనేమో