Chapter: 12th Chapter (Dwaadashaadhyaayamu)
A profound Telugu translation of the Bhagavad Gita Chapter 12 detailing the path of devotion (Bhakti Yoga).
Om
Om Sri Krishna Parabrahmane Namah
Geetaamrutamuna
Dwaadashaadhyaayamu
Bhakti Yogamu
Karma Yogulu Mukhyaalaa? Kanugonaga Jnaana Yogulu Mukhyaalaa
Veerilo Yevaru Goppa Vivarinchi Teliya Cheppumu Achyutaa! ||1||
Naayandu Manasu Nunchi Sthiramugaa Nannu Bhajiyinchuvaaru
Sarvamu Neneyanchu Madinenchi Sancharinchedu Vaarunu ||2||
Naaku Mukhyaalu Veerulu Phalguna Nannaashrayinchukatan
Veerikittunu Bhaktini Vegame Muktinittunu Premato ||3||
Avyayuni Agraahyuni Mariyunu Aprameyuni Gaanchagaa
Yatninchu Vaaru Gooda Arjunnā Nanne Pondangagalaru ||4||
Aa Maargam Atikashtamu Arjunnā Andariki Saadhyapadadu
Kashtamulu Padaka Paartha Chikkune Kamaleshu Paadabhakti ||5||
Nanne Gatigaa Nenchuchu Naakanni Karma Phalamulu Nichuchu
Naa Yandu Manasu Nunchi Yeppudu Nannu Sevinchuvāri ||6||
Janma Bandhambhu Nundi Rakshintu Satvarambuga Vaarini
Saukhyamunu Jnaanamittu Chakkagaa Sarvambu Nittu Nenu ||7||
Naa Yandu Manasu Nunchi Tiramugaa Nannu Bhajiyintuvēni
Naa Yandu Vasiyintuvu Nammumu Sandiyimbindu Ledu ||8||
Naa Yandu Manasu Nunchi Phalguna Nannu Jeragalēnichō
Abhyaasa Yogambuche Arjunnā Nannu Bondaga Vachunu ||9||
Daanikini Jaalavēni Nanu Goorchi Dharma Kaaryamula Nepudu
Gaavinchuchunna Neeku Galgunu Mokshamadi Nishchayamuga ||10||
Attu Cheyagalēnichō Arjunnā Nannaashrayinchi Neevu
Sarva Karmala Jeyuchu Chakkagaa Phalamu Naakarpimpumu ||11||
Abhyaasamuna Kannanu Jnaanam Bu Annividhamula Shreshthamu
Jnaana Yogamu Kantenu Dhyaanammu Shreshthamayi Yundu Nepudu ||12||
Karma Phalamula Viduchuta Kanugonaga Dhyaanammu Kanna Mēlu
Sarvottamamu Aiyyadi Shaantini Shaashvatambuga Goorchunu ||13||
Dveshimpanattivaadu Bhootamula Poshinchu Nattivaadu
Sukha Dukhamula Samamugaa Madilona Joochuchundedi Vaadunu ||14||
Daanambu Jeyuvaadu Mariyunu Dharmambu Jeyuvaadu
Orpu Galgina Vaadunu Nerputo Yogambu Cheyuvaadu ||15||
Kaarunya Hrudayundunu Kamalaakshu Sevajesēdu Vaadunu
Jnaanam Bu Galavaadunu Mariyunu Dhyaanambu Cheyuvaadu ||16||
Ahamu Lenattivaadu Arjunnā Mamata Lenattivaadu
Atyanta Priyudu Naaku Aatadu Pondu Muktini Nijamugaa ||17||
Parula Keppudu Bhayamu Phalguna Kalginpa Nattivaadu
Parulacheta Nu Bhayamu Pondaka Bhadrmuga Nunduvaadu ||18||
Sukha Dukhamulu Samamugaa Madilona Joochuchundedi Vaadunu
Dveshamadi Lenivaadu Denini Korakundedi Vaadunu ||19||
Maanava Maanamulanu Mahilona Samamugaa Joochevaadu
Shatru Mitrulanu Okkatigaa Joochēdu Shaanta Swaroopundunu ||20||
Atyanta Priyudu Naaku Arjunnā Antyamuna Nanne Bondhu
Ee Dharma Maargambunu Vidavagaaraadu Yevvarikainanu ||21||
Om Sri Krishna Parabrahmane Namah
Iti Sri Sachchidaananda Paramahamsa Swaami Praneetambayina
Geetaamrutamuna
Dwaadashaadhyaayamu Samaaptamu
Om Tat Sat Om
ఓం
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
గీతామృతమున
ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కర్మ యోగులు ముఖ్యాలా? కనుగొనగ జ్ఞాన యోగులు ముఖ్యాలా
వీరిలొ ఎవరు గొప్ప వివరించి తెలియజెప్పుము అచ్యుతా! ||1||
నాయందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజియించువారు
సర్వము నేనే యంచు మదినెంచి సంచరించెడు వారును ||2||
నాకు ముఖ్యాలు వీరులు ఫల్గుణ నన్నాశ్రయించుటన్
వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో ||3||
అవ్యయుని అగ్రాహ్యుని మరియును అప్రమెయుని గాంచగా
యత్నించు వారు కూడా అర్జున్నా నన్నే పొందంగలరు ||4||
ఆ మార్గమతికష్టము అర్జున్నా అందరికీ సాధ్యపడదు
కష్టములు పడక పార్థ చిక్కునే కమలేషు పాదభక్తి ||5||
నన్నే గతిగా నెంచుచు నాకన్ని కర్మ ఫలములు నిచ్చుచు
నా యందు మనసు నుంచి ఎప్పుడు నన్ను సేవించువారి ||6||
జన్మ బంధంబు నుండి రక్షింతు సత్వరంబుగా వారిని
సౌఖ్యమును జ్ఞానమిత్తు చక్కగా సర్వంబు నిత్తు నేను ||7||
నా యందు మనసు నుంచి తిరముగా నన్ను భజియింతువేని
నా యందు వశియింతువు నమ్ముము సందియంబిందు లేదు ||8||
నా యందు మనసు నుంచి ఫల్గుణ నన్ను చేరగలేనిచో
అభ్యాస యోగంబుచే అర్జున్నా నన్ను పొందగ వచ్చును ||9||
దానికిని జాలవేని నను గూర్చి ధర్మ కార్యములనెపుడు
గావించుచున్న నీకు గల్గును మోక్షమది నిశ్చయముగా ||10||
అట్టు చేయగలేనిచో అర్జున్నా నన్నాశ్రయించి నీవు
సర్వ కర్మల జేయుచు చక్కగా ఫలము నాకర్పింపుము ||11||
అభ్యాసమున కన్నను జ్ఞానంబు అన్నివిధముల శ్రేష్ఠము
జ్ఞాన యోగము కంటే ధ్యానమ్ము శ్రేష్ఠమయి యుండు నెపుడు ||12||
కర్మ ఫలముల విడుచుట కనుగొనగ ధ్యానమ్ము కన్న మేలు
సర్వోత్తమము అయ్యది శాంతిని శాశ్వతంబుగా గూర్చును ||13||
ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు
సుఖ దుఃఖముల సమముగా మదిలోన జూచుచుండెడి వాడును ||14||
దానంబు జేయువాడు మరియును ధర్మంబు జేయువాడు
ఓర్పు గల్గిన వాడును నేర్పుతో యోగంబు చేయువాడు ||15||
కారుణ్య హృదయుండును కమలాక్షు సేవజేసెడు వాడును
జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబు చేయువాడు ||16||
అహము లేనట్టివాడు అర్జున్నా మమత లేనట్టివాడు
అత్యంత ప్రియుడు నాకు ఆతడు పొందు ముక్తిని నిజముగా ||17||
పరుల కెప్పుడు భయము ఫల్గుణ కల్గింపనట్టివాడు
పరులచేతను భయము పొందక భద్రముగా నుండువాడు ||18||
సుఖ దుఃఖములు సమముగా మదిలోన జూచుచుండెడి వాడును
ద్వేషమది లేనివాడు దేనిని కోరనుండెడి వాడును ||19||
మానవ మానములను మహిలోన సమముగా చూచేవాడు
శత్రు మిత్రులను ఒక్కటిగా జూచెడు శాంత స్వరూపుండును ||20||
అత్యంత ప్రియుడు నాకు అర్జున్నా అంత్యమున నన్నే పొందు
ఈ ధర్మ మార్గంబును విడువగారాదు ఎవ్వరికైనను ||21||
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబయిన
గీతామృతమున
ద్వాదశాధ్యాయము సమాప్తము
ఓం తత్ సత్ ఓం
📖 గీతామృతం: శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలోని 12వ అధ్యాయం (భక్తి యోగం) యొక్క సారాంశాన్ని శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి గారు ఈ గేయ రూపంలో అద్భుతంగా అనువదించారు.
🙏 నిజమైన భక్తి: నిరంతరం భగవంతునిపై మనసు లగ్నం చేసి, అంకితభావంతో సేవించేవారే నిజమైన భక్తులని ఇందులో కృష్ణుడు స్పష్టంగా చెప్పారు.
✨ సులభ మార్గం: నిరాకార నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం కష్టమని, సగుణ రూపమైన శ్రీకృష్ణుడిని ఆరాధించడమే సాధకులకు సులభతరమని వివరించారు.
🤲 సకల కర్మల అర్పణ: మనం చేసే ప్రతి పనిని, కర్మ ఫలాలను భగవంతునికి అర్పించడం ద్వారా మోక్షం పొందవచ్చని బోధించారు.
🧘♂️ ధ్యాన మహిమ: కేవలం అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కంటే ధ్యానం, ధ్యానం కంటే కర్మ ఫల త్యాగం శ్రేష్టమైనవని భగవానుడు తేటతెల్లం చేశారు.
❤️ భక్తుని లక్షణాలు: ద్వేషం లేనివాడు, సర్వభూతాల పట్ల కరుణ ఉన్నవాడు, అహంకారం మరియు మమకారం వదిలినవాడే భగవంతునికి ఇష్టుడని స్పష్టం చేశారు.
⚖️ సమదృష్టి: సుఖదుఃఖాలను, శత్రుమిత్రులను, మానావమానాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞుడే ఉత్తమ భక్తుడని ఈ భక్తి యోగం తెలుపుతుంది.