Star Cast: Naga Durga
Producer: Dargupally Prabhakar | Choreography: Shekar Virus
A powerful and energetic devotional folk song dedicated to Goddess Yellamma, celebrating the vibrant Bonalu traditions and the motherly grace of the deity.
Naa pere Yellamma nenu Joguraalammo.....
Ayyo jodu gampallaa nannu jola jolantii...
Aaru gampallaa nenu aadinadannaamo...
Andari mungata ne Ammavaarune...
Kaliyugamulona kanne maataanantire...
Eyyo yaapashettanti naaku impugaayene...
Naa pere Yellamma nenu Joguraalammo.....
Ayyo jodu gampallaa nannu jola jolantii...
Aa serukatta meedi ammi kattamaisine...
Nee inti mungata ne suttaamaitine...
Aa mullokaalele aa Mutyaalammane...
Nannu seranannolaki nenu sharutuliddhune...
Ayyo korinollaku nenu kodukuliddhune...
Nannu adiginollaku aada biddaliddhune...
Naa pere Yellamma nenu Joguraalammo.....
Ayyo jodu gampallaa nannu jola jolantii...
Aa marri setlallaa ne maavuraaline.....
Aa orrela ompullaa ne oddukuntine...
Suttu settu selakallaa nenu sakkani talline...
Aa gattu meedunna... Gaundlaadi biddane......
Aa manddodduku nenu Maaremm talline.....
Aa Gangodduku nenu Gavuraala talline......
Naa pere Yellamma nenu Joguraalammo.....
Ayyo jodu gampallaa nannu jola jolantii...
Teerokka peru naadi teeru bandaaru...
Tirugaaram gola naaku teerutamiddhuru...
Ayyo Aashaadham elaa naaku aarathuliddhuru.....
Addedu biyyammu naa mungata podduru.....
Naa yaaparellaalane naaku toranamiddhuru...
Aa yata pillalane naaku kanukagiddhuru.....
Naa pere Yellamma nenu Joguraalammo.....
Ayyo jodu gampallaa nannu jola jolantii...
Nimmakaaya dalamlane naaku nindugeddhure.....
Aa seere battalane naaku sare poddure.....
Naa akka chellelle naaku paatalu paadudure....
Naa akitla aliki... botla patnaaledure.....
Amma sharanu sharanantu maata sagaadiddhure...
Talli sharanale antu... nannu aaraadiddhure...
Naa pere Yellamma nenu Joguraalammo.....
Ayyo jodu gampallaa nannu jola jolantii...
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో.....
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ...
ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో...
అందరి ముందట నే అమ్మవారునే...
కలియుగములోన కన్నె మాతానంటిరే...
ఎయ్యో యాపశెట్టంటి నాకు ఇంపుగాయెనే...
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో.....
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ...
ఆ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే...
నీ ఇంటి ముందట నే సుట్టమైతినే...
ఆ ముల్లోకాలేలే ఆ ముత్యాలమ్మనే...
నన్ను చేరనన్నోళ్లకి నేను షరతులిద్దునే...
అయ్యో కోరినోళ్లకు నేను కొడుకులిద్దునే...
నన్ను అడిగినోళ్లకు ఆడబిడ్డలిద్దునే...
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో.....
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ...
ఆ మర్రి సెట్లల్లా నే మావురాలినే.....
ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడుకుంటినే...
సుట్టు చెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే...
ఆ గట్టు మీదున్న... గౌండ్లాది బిడ్డనే......
ఆ మందొడ్డుకు నేను మారెమ్మ తల్లినే.....
ఆ గంగొడ్డుకు నేను గౌరాల తల్లినే......
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో.....
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ...
తీరుగొక్క పేరు నాది తీరు బండారు...
తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు...
అయ్యో ఆషాఢం ఎల నాకు ఆరతులిద్దురు.....
అడ్డేడు బియ్యమ్ము నా ముందట పొద్దురు.....
నా యాపరెళ్లాలనే నాకు తోరణమిద్దురు...
ఆ యాట పిల్లలనే నాకు కానుకగిద్దురు.....
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో.....
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ...
నిమ్మకాయ దండలనే నాకు నిండుగెద్దురే.....
ఆ చీరె బట్టలనే నాకు సరే పొద్దురే.....
నా అక్క చెల్లెల్లే నాకు పాటలు పాడుదురే....
నా ఆకిట్ల అలికి... బొట్ల పట్నాలేదురే.....
అమ్మ శరణు శరణంటూ మాట సాగాడిద్దురే...
తల్లి శరణాలే అంటూ... నన్ను ఆరాదిద్దురే...
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో.....
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ...
🙏 భక్తిభావం: ఈ పాట రేణుకా ఎల్లమ్మ తల్లి మహిమలను, ఆమె వివిధ రూపాలను (కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ) ఎంతో భక్తిశ్రద్ధలతో వివరిస్తుంది.
🎤 ప్రభ గాత్రం: అమ్మవారి పాటలు పాడటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని ప్రభ, తన పవర్ ఫుల్ వాయిస్ తో ఈ పాటకు ప్రాణం పోశారు.
✍️ రాజేంద్ర కొండ సాహిత్యం: పల్లె జనాలు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలను, ఆరాధనను కళ్లకు కట్టినట్లుగా రాజేంద్ర కొండ తన లిరిక్స్ లో వర్ణించారు.
🎶 మాస్ భక్తి మ్యూజిక్: మదీన్ ఎస్.కె అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు డీజే లింగా మిక్సింగ్ భక్తులను పూనకంతో ఊగిపోయేలా చేస్తాయి.
💃 నాగ దుర్గ నటన: అమ్మవారి రూపంలో, భక్తురాలిగా నాగ దుర్గ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ మరియు నృత్యంతో ఆకట్టుకుంది.
🌿 పల్లెటూరి ఆచారాలు: ఆషాఢ మాసం బోనాలు, వేప మండలు, జంతు బలులు వంటి తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలను ఈ పాటలో స్పష్టంగా చూపించారు.
🎬 మేకింగ్ అండ్ విజువల్స్: కమ్లి పటేల్ సినిమాటోగ్రఫీ, శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ పాటను దృశ్యపరంగా ఎంతో గ్రాండ్ గా మలిచాయి.