🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
వీడు మొరటోడు..
అని వాళ్ళు వీళ్ళు
ఎన్నెన్ని అన్నా
పసిపిల్ల వాడు
నా వాడు
వీడు మొండోడు
అని ఊరువాడ
అనుకున్నగాని..
మహారాజు నాకు
నా వాడు..
ఓ.. మాట పెలుసైనా..
మనసులో వెన్న..
రాయిలా ఉన్నవాడిలోన
దేవుడెవరికి తెలుసును నాకన్నా
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి
సంతోడే నా సామి..
ఓ... ఎర్రబడ్డా కళ్ళలోనా..
కోపమే మీకు తెలుసు..
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు..
కోర మీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు..
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు..
అడవిలో పులిలా సర
సర సర సర
చెలరేగడమే మీకు తెలుసు..
అలసిన రాతిరి ఒడిలో
చేరి తల వాల్చడమే
శ్రీవల్లికి తెలుసు
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి
సంతోడే నా సామి..
ఓ.. గొప్ప గొప్ప
ఇనాములనే..
ఇచ్చివేసే నవాబు..
నన్ను మాత్రం
చిన్ని చిన్ని ముద్దులడిగే
గరీబు
పెద్ద పెద్ద పనులు
ఇట్టే..
చక్కబెట్టే మగాడు..
వాడి చొక్కా ఎక్కడుందో..
వెతకమంటాడు చూడు..
బయటకు వెళ్లి ఎందరెందరినో..
ఎదిరించేటి దొరగారు..
నేనే తనకి ఎదురెల్లకుండా..
బయటకు వెళ్లరు శ్రీవారు..
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి..
ఇట్టాంటి మంచి మొగుడుంటే..
ఏ పిల్లయినా మహారాణి..
సాహిత్యం యొక్క గొప్పదనం
1. 'సూసేకి' గీతం భర్తపై భార్యకు ఉండే అపారమైన ప్రేమను, నమ్మకాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
2. చంద్రబోస్ గారి సాహిత్యం, భర్త బయట ఎంత కఠినంగా ఉన్నా, తన దగ్గర ఎంత మృదువుగా ఉంటాడో అనే విషయాన్ని చాలా అందంగా చెప్పింది.
3. దేవి శ్రీ ప్రసాద్ (DSP) కంపోజ్ చేసిన క్యాచీ బీట్ మరియు శ్రేయా ఘోషల్ మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి.
4. "సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి" అనే పల్లవి శ్రోతలను వెంటనే ఆకట్టుకుని, పదే పదే వినాలనిపించేలా చేస్తుంది.
5. ఒక సాధారణ ఇల్లాలు తన మొగుడి గొప్పతనాన్ని ఎంత గర్వంగా చెప్పుకుంటుందో ఈ పాట ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.