Choreography: Shekar Virus
Producers: Anusha, Anjali | DOP: Harish Patel
A playful and energetic folk song featuring a funny argument between two village girls over the same boy.
Vanneladi O Tikkuladi
Aa.. Vanneladi Vanneladi Malupukoke
Vaadni Mandu Petti Maaka Petti Lagaamake
O Tikkuladi Takkuladi Tippukoke
Vaadi Yelu Batti Poluchutte Daanne Nene
Nee Etthu Choopi Vampu Choopi Vaadukuke
Vaadni Vallo Esi Vollu Raasi Duvvamaake
Chhi Chhi Sichchuladi Sinneladi Simpukoke
Vaadi Chitti Gunde Dochukunna Sinnadaanne
Are Vanneladi Eme Tikkuladi
Arere Vanneladi Vanneladi Malupukoke
Vaadni Mandu Petti Maaka Petti Lagaamake
Pove Tikkuladi Takkuladi Tippukoke
Vaadi Yelu Batti Poluchutte Daanne Nene
Abbaa Maatakaari Soopunoori Maaye Seyyake
Vaadni Etthukelli Edo Oti Seyyamake
Saalle Amma Kuchchi Idikochchi Aadukoke
Vaadni Odisipatti Ollo Pettukune Daanne
Oho Vanneladi Aaha Tikkuladi
Osi Vanneladi Vanneladi Malupukoke
Vaadni Mandu Petti Maaka Petti Lagaamake
Aaha Tikkuladi Takkuladi Tippukoke
Vaadi Yelu Batti Poluchutte Daanne Nene
O Vagalaadi Ompulaadi Cheyyi Eyyake
Vaaniki Eedu Jodu Kudirina Sinnadaanne
Goppulaadi Nuppulaadi Muttukoke
Moodu Mullu Naa Mellona Kattetode
Saise Vanneladi Idise Tikkuladi
Saisu Vanneladi Vanneladi Malupukoke
Vaadni Mandu Petti Maaka Petti Lagaamake
Idise Tikkuladi Takkuladi Tippukoke
Vaadi Yelu Batti Poluchutte Daanne Nene
Vaaniki Dishti Petti Mannu Kotti Pattukellake
Vaanni Geddalaaga Tannukelli Navvamake
Ase Pachchi Gaddi Paala Buddi Mandipoke
Vaadu Manasupaddanantene Tiriginaane
Ayi Vanneladi Oyi Tikkuladi
Ayi Vanneladi Vanneladi Malupukoke
Vaadni Mandu Petti Maaka Petti Lagaamake
O Tikkuladi Takkuladi Tippukoke
Vaadi Yelu Batti Poluchutte Daanne Nene
Vanneladi O Tikkuladi
Vanneladi…
వన్నెలాడి ఓ టిక్కులాడి
ఆ.. వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఓ టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి ఏలు బట్టి పొలుచుట్టే దాన్నే నేనే
నీ ఎత్తు చూపి వంపు చూపి వాడుకుకే
వాడ్ని వల్లో వేసి వొల్లు రాసి దువ్వమాకే
ఛీ ఛీ సిచ్చులాడి సిన్నెలాడి సింపుకోకే
వాడి చిట్టి గుండె దోచుకున్న సిన్నదాన్నే
అరే వన్నెలాడి ఏమి టిక్కులాడి
అరెరే వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
పోవే టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి ఏలు బట్టి పొలుచుట్టే దాన్నే నేనే
అబ్బా మాటకారి సూపునోరి మాయే సెయ్యకే
వాడ్ని ఎత్తుకెళ్లి ఏదో ఓటి సెయ్యమాకే
సాల్లే అమ్మ కుచ్చి ఇదికొచ్చి ఆడుకోకే
వాడ్ని ఒడిసిపట్టి ఒల్లో పెట్టుకునే దాన్నే
ఓహో వన్నెలాడి ఆహా టిక్కులాడి
ఓసి వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఆహా టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి ఏలు బట్టి పొలుచుట్టే దాన్నే నేనే
ఓ వగలాడి ఒంపులాడి చెయ్యి ఎయ్యకే
వానికి ఈడు జోడు కుదిరిన సిన్నదాన్నే
గొప్పులాడి నుప్పులాడి ముట్టుకోకే
మూడు ముళ్లు నా మెల్లోన కట్టేటోడే
సైసే వన్నెలాడి ఇదిసే టిక్కులాడి
సైసు వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఇదిసే టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి ఏలు బట్టి పొలుచుట్టే దాన్నే నేనే
వానికి దిష్టి పెట్టి మన్ను కొట్టి పట్టుకెళ్లకే
వాణ్ని గెడ్డలాగా తన్నుకెళ్లి నవ్వమాకే
అసే పచ్చి గడ్డి పాల బుడ్డి మండిపోకే
వాడు మనసుపడ్డానంటేనే తిరిగినానే
అయి వన్నెలాడి ఓయి టిక్కులాడి
అయి వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఓ టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి ఏలు బట్టి పొలుచుట్టే దాన్నే నేనే
వన్నెలాడి ఓ టిక్కులాడి
వన్నెలాడి…
🔥 మాటల యుద్ధం: "వన్నెలాడి మలుపుకోకే, టిక్కులాడి తిప్పుకోకే" అంటూ ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే సరదా గొడవను సురేష్ కడారి చాలా న్యాచురల్ గా రాశారు.
💪 ఓనర్ షిప్ (Ownership): "వాడి ఏలు బట్టి పొలుచుట్టే దాన్నే నేనే", "మూడు ముళ్లు నా మెల్లోన కట్టేటోడే" అని ఆ అబ్బాయి మీద తమ హక్కును నిరూపించుకునే ప్రయత్నం భలే క్యూట్ గా ఉంటుంది.
🤬 నాటు తిట్లు: పల్లెటూళ్లలో ఆడవాళ్ళు కోపం వస్తే తిట్టుకునే "గెడ్డలాగా తన్నుకెళ్లి నవ్వమాకే", "సిచ్చులాడి సిన్నెలాడి సింపుకోకే" లాంటి నాటు పదాలను పాటలో చక్కగా వాడారు.
🎤 ప్రభ & లావణ్యల ఎనర్జీ: ఇద్దరు సింగర్స్ పోటీ పడి పాడటం వల్ల, నిజంగానే ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నారనే ఫీల్ మ్యూజిక్ లో క్యారీ అయింది.
🎶 మాస్ ఫోక్ బీట్: వెంకట్ అజ్మీరా అందించిన మ్యూజిక్ పక్కా మాస్ ఆడియన్స్ కు మరియు డ్యాన్స్ చేసేవారికి ఫుల్ మీల్స్ లాంటిది.
💃 అదిరిపోయే స్టెప్పులు: శేఖర్ వైరస్ కంపోజ్ చేసిన మూమెంట్స్ ఈ పాటకు విజువల్ గా మంచి హైప్ తీసుకొచ్చాయి.
🎬 ఫన్ కాన్సెప్ట్: ఒకే అబ్బాయి కోసం ఇద్దరు కొట్లాడుకోవడం అనే ఫన్ కాన్సెప్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.