పచ్చా పచ్చని చేలల్లో - Video and Auto play lyrics, Play and Enjoy
పూర్తి లిరిక్స్
పూర్తి లిరిక్స్:
Song Name : Naa Koduka
Lyrics : Nanda Kishore
Singer : Sinduri Vishal
Music : Devi Sri Prasad
Movie Name : Kuberaa
ఆ.. ఆ
పచ్చా పచ్చని చేలల్లో.. పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకో నా కొడుకా
కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్నంటుకునీ..
కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా..
పదిలంగా నువ్వు నడవాలే.. పది కాలాలు నువ్వు బతకాలే..
చందమామకు చెబుతున్నా నిను చల్లగా చూస్తది నా కొడుకా..
ఆకలితో నువ్వు పస్తుంటే.. నీడొక్కలు ఎండిపోయేరా..
చెట్టు చెట్టుకే చెబుతున్నా.. నీ కడుపు నింపమని నా కొడుకా..
నిద్దురలేక నువ్వుంటే.. నీ కన్నులు ఎర్రగా మారేరా..
నీలి మబ్బుతో చెబుతున్నానే.. జోలపాడమని నా కొడుకా..
మనిషికి మనిషే దూరమురా.. ఇది మాయా లోకపు ధర్మమురా..
బడిలో చెప్పని పాఠం ఇది నా బతికే నేర్చుకో నా కొడుకా..
తిడితే వాళ్ళకి తగిలేను.. నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు.. ఓపికతోటి నా కొడుకా..
రాళ్ళు రప్పల దారులు నీవి.. అడుగులు పదిలమ్మో కొడుకా..
మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి.. చూసుకు నడువుర నా కొడుకా
చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుకా..
ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కని ఉంటా నా కొడుకా..
పానము నీది పిట్టల తోటిది ఉచ్చుల పడకు ఓ కొడుకా..
ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదగర నా కొడుకా..
ఏ దారిలో నువ్వు పోతున్నా.. ఏ గండం నీకు ఎదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మ దీవెనిది నా కొడుకా
ఈ దిక్కులు నీతో కదిలేను.. ఆ చుక్కలి దిష్టి తీశాను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను అమ్మదీవెనిది నా కొడుకా
ఏ పిడుగుల చప్పుడు వినబడినా.. ఏ భూచోడికి నువ్వు భయపడినా..
ఏ చీకటి నిన్నే చేయదులేరా .. అమ్మ దీవెనిది నా కొడుకా..
అమ్మ దీవెనిది నా కొడుకా.. !!
Comments
Post a Comment