Jolali Jolali song Rayudu movie download | Jolali Jolali Lyrical and Full Video Song | Rayudu Telugu Movie | Mohan Babu, Soundarya



జోలాలి జోలాలి జోలాలి
జోల పాడుతా బజ్జో నా తల్లి
జోలాలి జోలాలి జోలాలి
జోల పాడుతా బజ్జో నా తల్లి
నిదుర తల్లిని ....బ్రతిమలాడని
నీలి కళ్ళలో.... నిదురపొమ్మని
రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో
రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో
జోలాలి జోలాలి జో..లాలి
జోల పాడుతా బజ్జో నా ..తల్లి

మీ అమ్మ తీయని గురుతుగా
ఇచ్చిన కానుక నీవమ్మ
ఈ పేద హృదయం లోనా
ఊపిరివే అమ్మ
నాకున్న వెలుగుల మేడ
చలువల నీడ నీవమ్మా
నా మనసే మెత్తగా పరిచా
పడుకోవే ..అమ్మ
అలుపు సొలుపు మాయం చేసే
చల్లని తల్లి ఎవరమ్మ
రాజు పేద తేడా లేకా
ఒడినే చేర్చే నిదురమ్మ
ఊహలోని లోకంలో
ఊయల వంటి కునుకులలో
నువ్వు హాయిగా తీయగా
ఆలా తేలిపోవమ్మ .....
జోలాలి జోలాలి జోలాలి
జోల పాడుతా బజ్జో నా తల్లి

ఆ తల్లి కడుపునా నీవు
తొమ్మిది నెలలే వున్నావు
ఈ రాయుడు గుండెల్లోన
ఎపుడు ఉంటావు ....
ఓ తల్లి నీ కేరింతలు ఎన్నడు
నా యద కదిపాయో
బ్రతుకంటే ఎంతటి తీపో
అపుడే తెలిసింది ....
రోజు నువ్వు నవ్వుతువుంటే
అన్నంతో పనిలేదమ్మ
ఒక్కపూట అలిగావంటే
ఆకలి నాకు కాదమ్మ ...
అందరికేమో రాజునురా ...
నీ దరి నేను బంటును రా
నీ నాన్నని బిడ్డని నేనే లే తల్లి
జోలాలి జోలాలి జోలాలి
జోల పాడుతా బజ్జో నా తల్లి
జోలాలి జోలాలి జో...లాలి
జోల పాడుతా బజ్జో నా.. తల్లి
నిదుర తల్లిని ...బ్రతిమలాడని
నీలి కళ్ళలో... నిదురపొమ్మని
రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో


Tags :- Rayudu movie songs, Rayudu songs download, Mohan babu rayudu movie songs download,  Jolali Jolali song Rayudu movie download | Jolali Jolali Lyrical and Full Video Song | Rayudu Telugu Movie | Mohan Babu, Soundarya 

Comments