చందమామ కోసం వేచి ఉన్న రేయిల
వెయ్యి కళ్లతోటి ఎదురు చూడన
వాన జల్లూ కోసం వేచి ఉన్న పైరుల
గంపెడంత ఆశతోటి చూడన
జోల పాటు కోసం ఊయలలోన చంటి పాప లాగా
కోడికూత కోసం తేలారు జాము పల్లెటూరి లాగా
ఆగనే లేనుగా చెప్పవ నేరుగా గుండెలో ఉన్న మాట
ఏయ్ ఒకటి రెండు మూడు అంటు
అరె ఓక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
వెల్లు వెల్లు వెల్లు అంటు ఈ కాలాన్ని ముందుకి నేను తోయనా
తొందరే ఉన్నదిగా ఊహకైనా అందనంతగా
కాలమా వెల్లవే తాబేళు లాగా అంత నెమ్మదా
నీతో ఉండుంటే నిన్నే చూస్తుంటే రెప్పల వేయకుండ చెపపిల్లలా
కలేమ్ వేయలేని ఆపేయలేని కాలం వెల్తోందీ జింకపిల్లలా
అడిగితే చెప్పావు
అలిగినప్పుడు చెప్పావు
కుదురుగా ఉన్నావేవు
ఏయ్ ఒకటి రెండు మూడు అంటు అరే
ఓక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
మూడు రెండు ఒకటి అంటు గడియారాన్ని వెనక్కి నేను తిప్పనా
ఎందుకో ఈవిటో నిన్నా మొన్నా లేని యాతనా
నా మది ఆగదే నేను ఎంత బుజ్జగించినా
చీ పో అంటావా
నాతో ఉంటావా
ఇంకేమంటావో తెల్లవారితే
విసుక్కుంటావో అతుక్కుంటావో ఎలా ఉంటావో లెక్క అందితే
ఇంకా ఊరించకు
ఇంత వేధించకు
న్నినిలా చంపమకు
ఏయ్ ఒకటి రెండు మూడు అంటు అరే
ఓక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
మూడు రెండు ఒకటి అంటు గడియారాన్ని వెనక్కి నేను తిప్పనా
సాహిత్యం యొక్క గొప్పదనం
1. భాస్కరభట్ల రవికుమార్ గారు రాసిన ఈ పాట ప్రేమలో ఉన్న యువతీయువకుల మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించింది.
2. "చందమామ కోసం వేచి ఉన్న రేయిల", "వాన జల్లూ కోసం వేచి ఉన్న పైరుల" వంటి పోలికలు ఎదురుచూపులోని మాధుర్యాన్ని, ఆశను కళ్లకు కట్టినట్లు చూపాయి.
3. తమ ప్రియమైన వారి కోసం కాలం నెమ్మదిగా వెళ్లాలని కోరుకోవడం ("కాలమా వెల్లవే తాబేళు లాగా అంత నెమ్మదా") ప్రేమలోని తీవ్రమైన భావోద్వేగాన్ని తెలియజేస్తుంది.
4. "ఒకటి రెండు మూడు అంటు ఓక్కో క్షణాన్ని లెక్క పెట్టనా" అనే పంక్తులు కలయిక కోసం ఉన్న ఆత్రుతను, ఉత్కంఠను సరళంగా, అందంగా వ్యక్తం చేస్తాయి.
5. G. వేణుగోపాల్, K.S. చిత్ర ల మధురమైన గానం, దేవి శ్రీ ప్రసాద్ యొక్క అద్భుతమైన సంగీతం ఈ సాహిత్యానికి మరింత అందాన్ని తీసుకొచ్చి, పాటను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.
Comments
Post a Comment