నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలుక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అనీ
ఐన ఇంతవరకు ఆచూకీ లేక
తెగిన గాలి పటమై తిరిగా
ఎటు దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ
ఏనాటికి చూపునో చిరునామా
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
ఇపుడే ఇటు వెళ్ళిందంటూ
చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమలముంది
ఇందాక చూశానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో
చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడి గంటల్లో తన
గాజుల సడి వింటుంటే
తాను ఈ కోవెల్లో
ఇప్పటి వరకు ఉన్నట్టే
ఎటు చూసిన తన జాడలు
ఎటు వెళ్లిందో ఈ లోపునే
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
నడయాడే దీపంలాంటి
ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండీ పోతుంది
నడకైనా నాట్యంలాగే
అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి
వచ్చిందనిపిస్తుంది
కొందరు చూసారో కలగన్నమనుకున్నారో
అందుకనే ఏమో తాను నిజం కాదనుకున్నారో
బతిమాలినా బదులివ్వదే
తాను ఉందంటే నను నమ్మరే
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలుక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అనీ
ఐన ఇంతవరకు ఆచూకీ లేక
తెగిన గాలి పటమై తిరిగా
ఎటు దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ
ఏనాటికి చూపునో చిరునామా
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
సాహిత్యం యొక్క గొప్పదనం
1. విరహంలో ఉన్న ప్రేమికుడు తన ప్రియురాలి ఆచూకీ కోసం నేల, పువ్వులు, నింగి, గాలి వంటి ప్రకృతిని అడుగుతున్న భావన అద్భుతంగా ఆవిష్కరించబడింది.
2. "ఐన ఇంతవరకు ఆచూకీ లేక తెగిన గాలి పటమై తిరిగా" వంటి వాక్యాలలో, ప్రేమికుడి నిస్సత్తువ, దిక్కుతోచని తనం హృదయాన్ని తాకేలా చిత్రీకరించబడింది.
3. సిరిమల్లెలో ఆమె నవ్వు, గాలిలో ఆమె పరిమళం, గుడి గంటలలో ఆమె గాజుల సడి వినడం వంటి వర్ణనలు ఆమె ఉనికిని అన్నిటా వెతుకుతున్న ఆశను తెలియజేస్తాయి.
4. ఆమె అందాన్ని 'నడయాడే దీపంలాంటి రూపం' అని, 'దివిలో ఉండే మెరుపు దిగి వచ్చిందని' పోల్చడం ద్వారా కవి తన ఉపమానాలతో అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లారు.
5. ఈ పాట సాహిత్యం ప్రేమలోని వేదనను, ఆరాధనను ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారి మధురమైన గాత్రంతో కలిసి ఒక అజరామరమైన అనుభూతినిస్తుంది.
Comments
Post a Comment