ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
నేల వైపు చూసీ నేరం చేశావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లెపూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరేవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
సాహిత్యం యొక్క గొప్పదనం
1. ఈ పాటలో ప్రేమికుని మనోవేదనను 'సముద్రమంతా కన్నీళ్లు', 'ఎడారి అంతా నిట్టూర్పు సెగలు' వంటి అద్భుతమైన పోలికలతో సిరివెన్నెల గారు ఆవిష్కరించారు.
2. "నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం" అనే పల్లవి ప్రేమలోని గాఢమైన, నిరంతరమైన ఆకాంక్షను తెలియజేస్తుంది.
3. వాన చినుకుని నిందించే మబ్బు, మల్లెపూవును బంధించే తీగ వంటి ప్రకృతి ఉపమానాలు ఉపయోగించి, ప్రేమించడం పాపం కాదని కవి ప్రశ్నిస్తారు.
4. 'రేపు లేని చూపు', 'శ్వాస లేని ఆశ' వంటి పదబంధాలు వియోగంలో ఉన్న ఆత్మ యొక్క నిస్సత్తువను, దిగులును స్పష్టంగా చిత్రీకరిస్తాయి.
5. ఈ పాట కవిత్వం సరళంగా ఉంటూనే, విఫలమైన ప్రేమలోని లోతైన భావోద్వేగాన్ని, నిస్సహాయతను హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేస్తుంది.
Comments
Post a Comment