వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకీ
కోటి దీపాల వెలుగు నీవే
తెలుసు నా కంటికీ
నిను దాచే ఈ నిసీ
నిలిచేనా ప్రేయసీ
నలువైపులా నల్లని చీకట్లే
ఎదురొస్తూ వున్నా
పరుగాపని పాదం దూరంతో
పోరాడుతూ వున్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే
తేరా వేస్తూ వున్నా
ప్రతి నిమిషం
నీ వైపే పయనిస్తూ వున్నా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకీ
గాలితో నువ్వు పంపిన
వలపు వూసేమిటో
పూలలో నువ్వు నింపిన తీపి తలపేమిటో
నిన్న నా కళను చేరలేదని
నమ్మదా చెలి నీ మౌనం
నా శ్వాసతో రగిలి గాలులతో
నిను వెతికిస్తున్నా
నా ప్రేమను పూల సువాసనతో
నీ కందిస్తూన్నా
ఎద సవ్వడులే ఆ మువ్వలుగా
ఎగరేస్తూన్నా
అవి నిన్నే చూడాలీ నువ్వెక్కడ వున్నా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకీ
ఆశగా వుంది నేచ్ఛేలీ
కలుసుకోవాలనీ
కోవెలయి వుంది కౌగిలి దేవి రావాలనీ
నీవు కలవని కలవు కాదనీ
రుజువు చేయనీ అనురాగం
నను నేనే శిలగా మోస్తున్నా
ఎద బరువై పోగా
చిరు నవ్వులనే వేలి వేస్తున్నా
నిను చూసే దాకా
ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా
పెను జ్వాలై పోగా
యెడ బాటు పోరా బాటు కరిగించే దాకా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకీ
కోటి దీపాల వెలుగు నీవే
తెలుసు నా కంటికీ
నిను దాచే ఈ నిసీ
నిలిచేనా ప్రేయసీ
నలువైపులా నల్లని చీకట్లే
ఎదురొస్తూ వున్నా
పరుగాపని పాదం దూరంతో
పోరాడుతూ వున్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే
తేరా వేస్తూ వున్నా
ప్రతి నిమిషం
నీ వైపే పయనిస్తూ వున్నా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకీ
సాహిత్యం యొక్క గొప్పదనం
1. "వేయి జన్మాల చెలిమి నీవే" అనే మొదటి వాక్యమే ఈ ప్రేమ నిత్యమైనదని, జన్మ జన్మల బంధమని చెప్పే సిరివెన్నెల వారి అద్భుతమైన తాత్వికతను చూపుతుంది.
2. చీకట్లు ఎదురొస్తున్నా, కన్నీరే తెర వేస్తున్నా 'ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ వున్నా' అనే భావన ప్రేమికుడి ఏకైక లక్ష్యాన్ని, అకుంఠిత దీక్షను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది.
3. శ్వాసతో ప్రేమను వెతికిస్తూ, ఎద సవ్వడులనే మువ్వలుగా ఎగరేస్తూ తన ఉనికిని తెలియజేసే ప్రయత్నం, ప్రేమలో ఉన్న ఆర్తిని, తపనను స్పష్టంగా తెలియజేస్తుంది.
4. 'కోవెలయి వుంది కౌగిలి దేవి రావాలనీ' వంటి ఉపమానాలు ప్రియురాలిని దేవతతో పోల్చి, ఆమె కోసం ఎదురుచూసే ఆలింగనాన్ని ఒక పవిత్ర స్థలంగా వర్ణిస్తాయి.
5. నిరీక్షణలో 'నను నేనే శిలగా మోస్తున్నా' అని చెప్పడం, విరహంలోని తీవ్రతను, యెడబాటును కరిగించే వరకు పోరాడే ప్రేమాగ్నిని శిఖర స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కవితాత్మకత.
Comments
Post a Comment