గప్పు చిప్పు గప్పు చిప్పు గంటులిప్పుడు
నీ కొప్పులోనా పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎంత చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అట్టి పట్టి బుగ్గుల్లోనా ఆశ గప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంటులిప్పుడు
నీ కొప్పులోనా పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎంత చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
నువ్వు కనరాకపోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు వచ్చేనంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చింతొచ్చుడు
కౌగిలించకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుండి మనసు ఎప్పుడు
ఇంత అంత కాదు దేని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బో అమ్మటోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంటులిప్పుడు
నీ కొప్పులోనా పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎంత చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
ఇటుకపై ఇటుక వెస్తే ఇల్లే కట్టుడు
నీ ముద్దుమీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు
నీ పక్కలొనా గుండె తోని గుండె గిల్లుడు
కుంచెతోనే రంగులద్దు చిత్రకారుడు
వీడు గొరుత్తోనే బొడ్డుపైన బొమ్మ గీస్తాడు
న్ననిలా మంచులా కరిగదీసుడు
అమ్మో ఎన్నీ కలలు ఉన్నాయయ్య నీకు పిల్లుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంటులిప్పుడు
నీ కొప్పులోనా పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎంత చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అట్టి పట్టి బుగ్గుల్లోనా ఆశ గప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడు ఎప్పుడు
సాహిత్యం యొక్క గొప్పదనం
1. సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఈ పాట, యువ మనసుల ప్రేమ, చిలిపి కోరికలు, మరియు సరసమైన భావాలను పల్లెటూరి యాసలో అద్భుతంగా పలికించింది.
2. 'గప్పు చిప్పు గంటులిప్పుడు' అంటూ అమ్మాయి జుట్టులో పువ్వులు పెట్టే రోజు ఎప్పుడొస్తుందని అబ్బాయి ఆరాటాన్ని చాలా సహజంగా, ఆకర్షణీయంగా వ్యక్తం చేశారు.
3. నింగిలో చంద్రుడు కూడా ఆమెకు పోలడు, ఆమెను చూడగానే కాలుజారుడు నేర్చుకుంది' వంటి పోలికలు తెలుగు సినీ గీతాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి.
4. 'నువ్వు కనరాకపోతే కోపమొచ్చుడు, కంటి ముందు వచ్చేనంటే కోరికొచ్చుడు' వంటి ద్వంద్వ మనస్తత్వాన్ని వివరిస్తూ, ప్రేమలోని తీపి బాధను కవి చాలా చక్కగా చూపించారు.
5. ఈ పాట చిరంజీవి గారి ఎనర్జీ, మణిశర్మ గారి మాస్ ట్యూన్‌తో కలసి అప్పటి యువతను ఉర్రూతలూగించి, ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
Comments
Post a Comment