కొడితే కొట్టాలిరా
సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా
రఫ్ఫాడాలి
కొడితే కొట్టాలిరా
సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా
రఫ్ఫాడాలి
బాటేదైనా గాని
మునుముందుకెళ్లాలి
పోటీ ఉన్నాగాని
గెలుపొందీ తీరాలి
ఈ చరిత్రలో
నీకు కొన్ని
పేజీలుండాలి
చిందే వేయాలి
నటరాజులాగా
నవ్వే చిందాలి
నేల రాజులా
మనసే ఉండాలి
మహారాజు లాగా
ముగిసే పోవాలి
రాజు–పేద తేడాలన్నీ
కొడితే కొట్టాలిరా
సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా
రఫ్ఫాడాలి
చెయ్యి ఉంది నీకు
చెయ్యి కలిపేటందుకే
చూపుంది ఇంకొకరికి
దారి చూపేటందుకే
మాట ఉంది నీకు
మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటను
నెరవేర్చేటందుకే
ఆరాటం నీకుంది
ఏ పని అయినా చేయడానికి
అభిమానం తోడుంది
ఎండాకైనా నడపడానికి
ఈ ప్రాణం దేహం జీవం ఉంది
పరుల సేవకే
చేసే కష్టాన్ని
నువ్వే చేయాలి
పొందే ఫలాన్ని
పంచివ్వాలి
అందరి సుఖాన్ని
నువ్వే చూడాలి
ఆ విధి రాతని
చెమటతోనే చెరిపేయాలి
పెద్దవాళ్లకెప్పుడు
నువ్వు శిరసు వంచరా
అరే చిన్నవాళ్లనెప్పుడు
ఆశీర్వదించరా
లేని వాళ్లనెప్పుడు
నువ్వు ఆదరించరా
ప్రతిభ ఉన్నవాళ్లనెప్పుడు
నువ్వు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే
శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్ని పీడించే
చీడను మాత్రం తుంచెయ్యా
ఈ ఆశ జీవి చిరంజీవి
సూత్రమిదేరా
దేవుడు పంపిన
తమ్ముళ్లే మీరు
రక్తం పంచిన
బంధం మీరు
చుట్టూ నిలిచినా
చుట్టాలే మీరు
నన్నే చూపిన
అద్దాలంటే మీరే మీరే
కొడితే కొట్టాలిరా
సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా
రఫ్ఫాడాలి
కొడితే కొట్టాలిరా
సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా
రఫ్ఫాడాలి
బాటేదైనా గాని
మునుముందుకెళ్లాలి
పోటీ ఉన్నాగాని
గెలుపొందీ తీరాలి
ఈ చరిత్రలో
నీకు కొన్ని
పేజీలుండాలి
చిందే వేయాలి
నటరాజులాగా
నవ్వే చిందాలి
నేల రాజులా
మనసే ఉండాలి
మహారాజు లాగా
ముగిసే పోవాలి
రాజు–పేద తేడాలన్నీ
సాహిత్యం యొక్క గొప్పదనం
1. ఈ పాట మనిషి తన లక్ష్యాలను అత్యున్నతంగా (సిక్స్ కొట్టాలి) ఉంచుకోవాలని స్ఫూర్తినిస్తుంది.
2. సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సాహిత్యం ప్రబోధిస్తుంది.
3. కష్టపడి పని చేయడం (చెమటతో రాతను చెరపడం) మరియు ఆ ఫలితాన్ని పంచుకోవడం లోని ఆనందాన్ని వివరించారు.
4. రాజు-పేద, కుల-మత భేదాలు లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే మానవతావాదం ఈ పాటలో కనిపిస్తుంది.
5. చిరంజీవి గారి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కు తగ్గట్టుగా చంద్రబోస్ గారు రాసిన మాటలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపుతాయి.
Comments
Post a Comment