చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి
చూపు
ఊరికే ఉండదు కాసేపు
అస్తమానం నీ లోకమే
నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా, నా నిద్దర
కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు
వాకిలి కాసా
రా, నా ఆశలు
పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం
సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట
పుట్టింది
పుడుతూనే నీ పిచ్చి
పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది
సామికి ముక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తోంది
హా, చుట్టేస్తోంది
చుట్టమల్లే చుట్టేస్తోంది, ఆ,
అ-రె-రె-రే
చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి
చూపు
ఊరికే ఉండదు కాసేపు
మత్తుగా మెలేసింది నీ
వరాల మగసిరి
హత్తు కోలేవా మరి
సరసన చేరి
వాస్తుగా పెంచానిట్టా వంద
కోట్ల సొగసిది
ఆస్తిగా అల్లేసు కో
కోసరి కోసరి
చేయరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి
ముట్టడించి ముట్టేసు కోలేవా
ఓ సారి చేయిజారి
రా, ఏ బంగారు
నెక్లేసు నా ఒంటికి
నచ్చట్లే
నీ కౌగిలితో నన్ను
సింగారించు
రా, ఏ వెన్నెల
జోలాలి నన్ను నిద్దర
పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం
ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట
పుట్టింది
పుడుతూనే నీ పిచ్చి
పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది
సామికి ముక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తోంది
హా, చుట్టేస్తోంది
చుట్టమల్లే చుట్టేస్తోంది, ఆ,
అ-రె-రె-రే
చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి
చూపు
ఊరికే ఉండదు కాసేపు
సాహిత్యం యొక్క గొప్పదనం
1. "చుట్టమల్లే" గీతం అద్భుతమైన ప్రేమ భావనను, ప్రియునిపై ఉన్న గాఢమైన ఇష్టాన్ని సున్నితంగా వ్యక్తపరుస్తుంది.
2. రామజోగయ్య శాస్త్రి గారి కలం నుండి జాలువారిన పదాలు హీరోయిన్ మనసులోని తొలి వలపును కళ్ళకు కట్టినట్లు చూపుతాయి.
3. "మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి" వంటి వాక్యాలు ప్రేమలోని మధురానుభూతిని అత్యంత రొమాంటిక్ గా వర్ణిస్తాయి.
4. అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన బాణీ మరియు శిల్పా రావు అద్భుతమైన గాత్రం ఈ పాటకు మరింత మాధుర్యాన్ని అద్దాయి.
5. వంద కోట్ల సొగసును ఆస్తిగా అల్లేసుకోమంటూ ప్రియుడిని కోరుకునే తీరు మరియు వయ్యారాలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Comments
Post a Comment