🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
సారే, మన సారే… చల్
సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా
మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా
ఎండ్ల నుండి ఎనక బాటు జూసిండు
ఎత్తుకున్నదమ్మా గులాబీ జెండా
సావునోటిలోన తల పెట్టినాడు
స్వరాష్ట్ర పొద్దయ్యి వర్ధిల్లినాడు
(స్వరాష్ట్ర పొద్దయ్యి వర్ధిల్లినాడు)
పతకాలు ఎన్నో పంచినదమ్మా
ప్రజల గుండెల్లోన నిలిసినదమ్మా
రెండు వేలు ఇచ్చే పెన్షను నేడు
ఐదు వేలుకు పెంచుతనండు
(ఐదు వేలుకు పెంచుతనండు)
కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రయ్యి
కట్నమిచ్చి కాళ్లు కడిగిందాయో
కేసీఆరే ప్రతి ఇంటికి ధీమా
అందించునే ఐదు లక్షల బీమా
సారే, మన సారే…
పెద్ద సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా
మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా
ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు
ఆత్మస్థైర్యమే ఇచ్చినదమ్మా
రైతుబంధు రైతు భీమాను ఇచ్చిన
పెద్ద రైతు మన కేసీఆరు…
(పెద్ద రైతు మన కేసీఆరు)
ప్రాజెక్టులు ఎన్నో కట్టినదమ్మో
పంట పొలాలను తడిపినదమ్మా
మిషన్ కాకతీయతో ఊరి చెరువు
మట్టడి పారి తీర్చింది కరువు
(మట్టడి పారి తీర్చింది కరువు)
తొలగించాడురా కంట నీళ్లు
ఇంటింటికీ వచ్చే నల్ల నీళ్లు
అభివృద్ధికి ఆయనే మారుపేరు
నీళ్లకాల సృష్టికర్త కేసీఆరు…
సారే, బోల్ సారే… చల్
సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా
మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా
నిలువనీడ లేని నిరుపేదలకు
గృహలక్ష్మితో సాయం అందించెనమ్మా
పెరిగిన ధరలకు అల్లాడుతున్న
బక్కచిక్కినోళ్ల దిక్కైనాడు
(బక్కచిక్కినోళ్ల దిక్కైనాడు)
నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్
అందిస్తానంటూ హామీ ఇచ్చిండు
మహిళా సమాఖ్యల సొంత భవనాలకు
మాటిచ్చినదమ్మా మనసున్న నేత
అడగకుండానే అన్నీ చేసే
ఆత్మబంధువయ్యి మనల జూసే
బంగారు తెలంగాణ ఈ బాటసారి
గెలిపించుకుందాం మల్లొక్కసారి
సారే, మన సారే… చల్
సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా
మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా
దండీ ధైర్యాన్నిచ్చే రా దళిత బంధు
గుండె నిబ్బరమాయే బీసీల బంధు
అగ్రవర్ణ పేదల విద్య కోసం
రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తానండు
(రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తానండు)
సాయమై వచ్చింది మైనారిటీ బంధు
ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్
వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా
ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల
(ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల)
ప్రజల క్షేమమే కోరెనయో
సంక్షేమ పథకాల సర్కారయో
కష్టజీవుల సద్ది బువ్వయినోడు
తెలంగాణ బతుకు తోవ్వయినాడు
సారే, మన సారే… చల్
సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా
మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా
సన్నబియ్యంతోని కడుపులు నింపగా
అన్నపూర్ణ ఆ పథకం జూడు
ఉన్నత విద్యకు నిలయమైన
గురుకుల పాఠశాలలు నేడు
(గురుకుల పాఠశాలలు నేడు)
ఆడబిడ్డల ఆత్మగౌరవమయే
మూడు వేలుతోని సౌభాగ్య లక్ష్మి
పదిహేను లక్షల ఆరోగ్య రక్ష
కేసీఆరే మనకు శ్రీరామ రక్ష
(కేసీఆరే మనకు శ్రీరామ రక్ష)
ప్రగతిలోన్ పరిగెత్తే కారు
పాలనకిన్ కెవరు సాటిరాడు
ప్రపంచ దేశాలే కొనియాడిన తీరు
మల్లీ రావాలే గులాబీ సర్కారు
సారే, మన సారే…
కేసీఆరే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా
మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా
సాహిత్యం యొక్క గొప్పదనం
🌟 ప్రజా సంక్షేమ గీతం: తెలంగాణ ప్రభుత్వ పథకాలను, నాయకత్వ దార్శనికతను ఈ పాటలో అద్భుతంగా వివరించారు.
❤️ సామాన్యుల గుండె చప్పుడు: దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలతో సామాన్యుల జీవితాల్లో వచ్చిన వెలుగులను ఈ పాట గుర్తుచేస్తుంది.
✍️ బుర్ర సతీష్ సాహిత్యం: రచయిత బుర్ర సతీష్ రాసిన ప్రతి పదం ప్రజల ఆకాంక్షలను, గులాబీ సర్కార్ విజయాలను కళ్లకు కట్టినట్లు చూపించింది.
🎤 నల్గొండ గద్దర్ గళం: సింగర్ నర్సన్న (నల్గొండ గద్దర్) తన పవర్ ఫుల్ వాయిస్ తో ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు.
🎶 రవి కళ్యాణ్ సంగీతం: రవి కళ్యాణ్ సమకూర్చిన సంగీతం మరియు బీట్ ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించేలా ఉంది.
🌾 రైతుకు భరోసా: ఆత్మహత్యలతో అల్లాడిన రైతులకు రైతుబంధు, రైతు బీమాతో ఇచ్చిన ఆత్మస్థైర్యాన్ని సాహిత్యంలో చక్కగా వర్ణించారు.
🏢 అభివృద్ధికి మారుపేరు: మిషన్ కాకతీయ నుండి మెడికల్ కళాశాలల వరకు జరిగిన అభివృద్ధిని ఈ పాటలో గర్వంగా ప్రస్తావించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) 🤔
ఈ ఉత్తేజభరితమైన పాటను ప్రముఖ గాయకుడు నర్సన్న (నల్గొండ గద్దర్) పాడారు.
ఈ పాటకు రవి కళ్యాణ్ (Ravi Kalyan) పవర్ ఫుల్ మరియు ఎనర్జిటిక్ సంగీతాన్ని సమకూర్చారు.
ప్రభుత్వ పథకాలను, నాయకత్వ పాలనను వివరిస్తూ ఈ పాటను బుర్ర సతీష్ (Burra Sathish) రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి పాలనను ఈ పాట వివరిస్తుంది.
ఈ ప్రచార గీతాన్ని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తమ అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది.