ఎవరేమి అన్నా ఎన్ననుకున్నా
మన లోకమేదో మనదే అవునా
దిక్కులేమవుతున్నా చుక్కలేమైనా
పక్కనే నువ్వుంటే పట్టదేదైనా
ఎటు పోతున్నా గాని
నేనీకిక జత పడనా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా
హాయ్ హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా...
చిన్ని చిన్ని గుండె చిందులేయమంది
చిట్టి చిట్టి గువ్వై రెక్కలిప్పమంది
ఎప్పుడో
బళ్లో ఆడే ఆట గుళ్ళోకెళ్లి పాడే పాట
ఎందుకో
నేడు నీతో పాటు ఆడాలందే పాడాలందే
మారే నీ తీరే వారె వా వారే
ఒకరైనా ఈ కాసేపైనా గడపరు మనలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా
హాయ్ హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా
పుస్తకాలలోన అచ్చు వేయలేదే
వెండితెర మీన వచ్చినట్టు లేదే
కొత్తగా
ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ
ఒట్టుగా
ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేదీ రాత
అయినా బాగు...
అయినా బాగుందే చానా బాగుందే
ప్రతీ ప్రేమ ఒలాగే ఉంటే చరితకు వెగటే
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా
హాయ్ హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా....
సాహిత్యం యొక్క గొప్పదనం
carefree వైబ్: సమాజం ఏమనుకున్నా పట్టించుకోకుండా, తమదైన లోకంలో బతికే ప్రేమ జంట మనస్తత్వాన్ని ఈ పాట అద్భుతంగా తెలియజేస్తుంది.
స్వేచ్ఛా భావన: "చిట్టి చిట్టి గువ్వై రెక్కలిప్పమంది" అనే పంక్తులు, ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వేచ్ఛను, ఉత్సాహాన్ని వర్ణిస్తాయి.
ప్రత్యేకమైన ప్రేమకథ: "పుస్తకాలలోన అచ్చు వేయలేదే" అంటూ, తమ ప్రేమకథ ఎంతో ప్రత్యేకమైనదని, ఒకేలా ఉండే ప్రేమకథలు బోర్ కొడతాయని రచయిత చాలా కొత్తగా చెప్పారు.
మణిశర్మ సంగీతం: క్యాచీ ట్యూన్‌తో, ఎనర్జిటిక్ బీట్తో మణిశర్మ సంగీతం పాటను రిపీట్ మోడ్‌లో వినేలా చేస్తుంది.
హేమచంద్ర గాత్రం: హేమచంద్ర తనదైన స్టైల్లో పాడి, పాటకు కావాల్సిన పూర్తి జోష్‌ను అందించాడు.
Comments
Post a Comment